రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగ మోహన కృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి రెండేళ్లు పూర్తయ్యాయని ఆరోపించారు. శుక్రవారం వైఎస్ఆర్సిపి వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు పట్టణంలోని రేపల్లె తాలూకా సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ,
వైసీపీ శ్రేణులపై దాడులు, కేసులు పెట్టడం వంటివి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో జరిగాయని ఆయన విమర్శించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో
వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.