రేపల్లె ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద డ్రైనేజీ కాలువలో అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు మృతదేహంపై గాయాలను గుర్తించి, నిజాంపట్నం మండలం యడ్లంకకు చెందిన మాతంగి సురేశ్‌గా మృతుడిని గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.