పాఠశాల బస్సు బోల్తా త్రుటిలో తప్పిన ప్రమాదం

477చూసినవారు
పాఠశాల బస్సు బోల్తా త్రుటిలో తప్పిన ప్రమాదం
శుక్రవారం, నగరం మండలంలోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌కు చెందిన బస్సు మీసాలవారిపాలెం వైపు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. పాఠశాలలు ప్రారంభమైన రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. గ్రామస్థుల సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేరు, డ్రైవర్, క్లీనర్ మాత్రమే ఉన్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్