పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి తహసిల్దార్

1776చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి తహసిల్దార్
రేపల్లె తహసిల్దార్ మోర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పోలియో రహిత సమాజం కోసం ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పల్స్ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో తాసిల్దార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పేటేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్