ఏసుక్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయం: పాస్టర్ దినకరన్

1518చూసినవారు
ఏసుక్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయం: పాస్టర్ దినకరన్
చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన మన్నా మహా విడుదల పండుగలో దైవ సేవకులు పాస్టర్ పి. దినకరన్ దైవ సందేశాన్ని అందజేశారు. ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని, ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆయన అన్నారు. ఈ సభలకు చెరుకుపల్లి మండలంలోని వివిధ గ్రామాల సంఘస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. దైవ సేవకురాలు దాసరి సునీత ఆధ్వర్యంలో క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమం బాపట్ల, రేపల్లె ప్రాంతాల భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

సంబంధిత పోస్ట్