గతేడాది రేపల్లె మండలం పేటేరులో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తెనాలికి చెందిన వేంకటేశ్వర్లు, వరదయ్య మద్యం సేవిస్తున్న సమయంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయస్థానం నిందితులకు యావజ్జీవ శిక్షతో పాటు చెరో రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.