రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలన మోసపూరితమని, వెన్నుపోటుతో కూడుకున్నదని వేమూరు వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వరికుటి అశోక్ బాబు విమర్శించారు. వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు కొల్లూరు మండల కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వంచించిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదని ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి శ్రేణులు పాల్గొన్నారు.