తెనాలిలో ఐదుగురి అరెస్ట్

1128చూసినవారు
తెనాలిలో ఐదుగురి అరెస్ట్
తెనాలి రామలింగేశ్వరపేటలోని పాత ఆర్టీసీ డిపో వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో వన్‌టౌన్‌ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్