ముప్పాళ్ల మండలంలో గురువారం రాత్రి ఒక్కసారిగా జోరుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతంగా ఉన్న వాతావరణం రాత్రికి వర్షంగా మారడంతో పలుచోట్ల రహదారులు తడిసిముద్దయ్యాయి. రాత్రి సమయం కావడంతో ప్రజలు అత్యవసర పనులు మినహా బయటకు రావకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో లేదా ఎత్తైన ప్రదేశాల్లో నిలవకుండా జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ శాఖ ప్రజలకు సూచించింది.