దొండపాడులో వైభవంగా శాంతి కళ్యాణం

4031చూసినవారు
దొండపాడులో వైభవంగా శాంతి కళ్యాణం
గుంటూరు జిల్లా తాడికొండ మండలం దొండపాడు గ్రామంలో శ్రీ భ్రమరాంబా సమేత రాజమహేశ్వర స్వామి దేవస్థానంలో 11 సంవత్సరాలు పూర్తయి 12వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, ఆలయ ధర్మకర్త నన్నపునేని సదాశివరావు ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ సమేత రాజమల్లేశ్వర స్వామి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకము, గణపతి పూజ, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం శాంతి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని, సాయంత్రం 4 గంటలకు గ్రామ ఉత్సవ సేవ ఉంటుందని, భక్తులందరూ పాల్గొనాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్