అమరావతిని ఇక టచ్‌ చేయలేరు

532చూసినవారు
అమరావతిని ఇక టచ్‌ చేయలేరు
‘అమరావతి ప్రజా రాజధాని. ఇక దీన్ని ఎవరూ ఒక ఇంచి కూడా కదపలేరు. రాజధాని ప్రగతిని అడ్డుకోలేరు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఇది ఓ చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు. ‘‘ ఈ రోజు లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందింది. రేపు (గురువారం) రాజ్యసభకు వెళుతుంది. ఆంధ్రుల కల నెరవేరే సమయం ఎంతోదూరం లేదు’’ అని చంద్రబాబు అన్నారు. ఇన్ని దశాబ్దాల కాలంలో వైసీపీ లాంటి విధ్వంస నాయకత్వాన్ని తాను చూడలేదని తెలిపారు. ‘‘నాడు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు. మూడు ముక్కలాట తరహాలో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని కుట్ర పన్నారు. అమరావతిపై తీర్మానం కోసం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కూడా రాకుండా దాక్కున్నారు. దీనిని ఎలా రాజకీయ పార్టీ అనాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ఆ పార్టీ గురించి మాట్లాడాలంటేనే సిగ్గుపడేలా ఆ పార్టీ నాయకత్వం ప్రవర్తిస్తోంది’’ అని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

సంబంధిత పోస్ట్