తాడికొండ మండలం ఫిరంగిపురం వేమవరంలో బుధవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సబిరా బేగం గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, శిశు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ ఎన్ వి లక్ష్మి, పి హెచ్ ఎన్ శోభారాణి, ఎమ్ ఎల్ ఎచ్ పి /సి హెచ్ ఓ రజిత, ఏఎన్ఎం విజయ రాణి, ఆశా కార్యకర్తలు రోజా, నాగలక్ష్మి, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.