తాడికొండలో ఉచిత కంటి వైద్య శిబిరం

2చూసినవారు
తాడికొండలో ఉచిత కంటి వైద్య శిబిరం
తాడికొండ నియోజకవర్గ కేంద్రంలోని రావిచెట్టు సెంటర్ వద్ద బండ్ల కోటేశ్వరరావు మిత్రమండలి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 82 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, ఆపరేషన్లు అవసరమైన వారిని ఉచిత బస్సు సౌకర్యంతో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావుతో పాటు ధనేకుల హరిబాబు, ఈద మోహన్ రెడ్డి తదితరులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్