తుళ్లూరు మండలం తుళ్లూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానంలో భద్రపద శుక్లపక్ష ఏకాదశి పురస్కరించుకొని శ్రీ కోదండ రామస్వామి వారికి సహస్రనామ అర్చన, విగ్నేశ్వర పూజ, 108 పర్యాయములు నిర్వహించినట్లుగా ఆలయ అర్చక స్వామి డి. రాజగోపాల్ ఆచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమం వరసిద్ధి విజ్ఞేశ్వర స్వామి కమిటీ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. వచ్చిన వారందరికీ తీర్థ ప్రసాద గోష్టి, ముత్తయిదువులకు తాంబూల కార్యక్రమం జరిగింది. అలాగే శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి దేవస్థానంలో సహస్రనామా అర్చన, సింధూరంతో పూజ నిర్వహించామని ఆలయ అర్చక స్వామి డి శేష చార్యులు తెలిపారు.