ఫిరంగిపురం మండలంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేడి గాలులు, తీవ్రమైన ఉక్కబోతతో అల్లాడిపోయిన ప్రజలకు మోస్తరు వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భానుడి భగభగలకు చెక్ పెడుతూ కురిసిన ఈ వానతో వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారింది.