దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం: నైరా హాస్పిటల్స్

1చూసినవారు
దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం: నైరా హాస్పిటల్స్
స్థానిక లామ్ గ్రామంలో మెగామెడికల్ క్యాంప్ నైరా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అనేకమంది గ్రామస్తులు ఈ ఉచిత వైద్య శిబిరమునకు హాజరై నిపుణులైన వైద్యలు సలహాలతో ఉచితంగా మందులు తీసుకున్నారు. దీర్ఘ కాలిక కడుపునొప్పి, పసరుతిత్తి లో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్, థైరాయిడ్ గ్రంధి వాపును నిర్లక్ష్యం చేయకూడదని ప్రముఖ సర్జెన్ షేక్ జిలానీ చెప్పారు. ఈ మెగా క్యాంపులో ప్రకాశ్ డెంటల్ డాక్టర్ ప్రకాష్ హాజరవ్వగా, తార ఐకేర్ హాస్పిటల్ వారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. క్యాంప్ సమన్వయకర్తగా నైరా హెల్త్ కేర్ ఇన్చార్జ్ జి. దిలీప్ కుమార్ వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్