తాడేపల్లిలో దేవదాయ శాఖ అధికారి శాంతి నివాసంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నట్లు ACB అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఎండాడ (విశాఖ)లో లగ్జరీ ఫ్లాట్, కుంచనపల్లిలో జి+2 బిల్డింగ్, 770 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి, బ్యాంకు ఖాతాలో రూ. 3 లక్షల నగదు, రూ. 1.15 లక్షల నగదు, వోక్స్‌వ్యాగన్ కారు, బైక్, ఇతర విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నట్లు అధికారులు సుదీర్ఘ సోదాలలో గుర్తించారు.