తుళ్లూరు: ఉపాధి పనులు పక్కాగా నిర్వహించాలి

832చూసినవారు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రిసోర్స్పర్సన్ రవి పేర్కొన్నారు. శనివారం తుళ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 17వ రౌండ్ సామాజిక తనిఖీపై కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు మండల వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తామని, అభ్యంతరాలు, సమస్యలు ఉన్న సభల్లో తెలియజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్