అమరావతి బిల్లుపై రాజ్యసభలో వైసీపీ వ్యతిరేకం, వాకౌట్

253చూసినవారు
అమరావతి బిల్లుపై రాజ్యసభలో వైసీపీ వ్యతిరేకం, వాకౌట్
అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. లోక్‌సభలో మాదిరిగానే వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా బిల్లులో లేదని, అమరావతిలో శాశ్వత నిర్మాణాలు జరగలేదని, రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదని, రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, రైతుల నుంచి సేకరించిన 50 వేల ఎకరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, మౌలిక వసతులకు రూ.2 లక్షల కోట్లు, రెండేళ్లలో రూ.3.40 లక్షల కోట్ల అప్పు చేశారని, ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. అనంతరం బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.

సంబంధిత పోస్ట్