
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ: కేంద్ర మంత్రికి BJMC వినతి
ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల అభివృద్ధి, ప్రయోజనాల కోసం డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వాలని BJMC రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ భాష, పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ కేంద్ర మంత్రి శంతన ఠాకూర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. మత్స్యకారులకు డీజిల్‌పై రూ. 16.50 సబ్సిడీ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోర్టు పరిధిలోని కొన్ని ఫ్యాక్టరీల వల్ల మత్స్యకారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.





































