తెనాలి శివారు జగ్గడిగుంటపాలెం వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పెదరావూరు వైపు నుంచి తెనాలి వస్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మోటర్ బైక్‌పై వస్తున్న తోట ప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అప్రమత్తమై తీవ్ర గాయాలతో ఉన్న ప్రకాశ్‌ను తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.