గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం శ్రీ అవధూత దత్త పీఠంలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆశ్రమం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.