గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో అర్ధరాత్రి మున్నంగి ఇసుక రీచ్ లో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు అధికారులు 4 ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్ కు గురువారం తరలించారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లిపర ఎస్.ఐ. ఎన్.సి. ప్రసాద్ తెలిపారు.