కొల్లిపర: ‘బంగారు కుటుంబాలు' శిక్షణ కార్యక్రమం

1167చూసినవారు
కొలిపర్ ఎం.డి.ఓ కార్యాలయంలో బుధవారం 'బంగారు కుటుంబాలు' శిక్షణ కార్యక్రమం జరిగింది. మండలంలోని గ్రామాల్లో వర్షాల వల్ల వచ్చే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రజలు స్థానికంగా ఉండే ఆర్.ఎం.పిల వద్ద కాకుండా పి.హెచ్.సి లేదా యు.పి.హెచ్.సి లకు వెళ్లాలని సూచించారు. కృష్ణా నదిలో వరద ఎక్కువగా ఉన్నందున లంక గ్రామాల ప్రజలపై ప్రత్యేక నిఘా ఉంచాలని మండలానికి ఇంచార్జ్ తాసిల్దార్ గోపాలకృష్ణ ఆదేశించారు.