గుంటూరు జిల్లా తెనాలిలో, 2009 బ్యాచ్‌కు చెందిన డి. రవీంద్రబాబు గురువారం తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సీఐగా పదోన్నతి పొందిన ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తానని సీఐ రవీంద్రబాబు తెలిపారు. ఆయన గతంలో త్రీ టౌన్ ఎస్ఐగా పనిచేశారు.