తెనాలిలో డ్రైనేజీ మ్యాన్‌హోల్ తెరిచి ఉంచడం.. విద్యార్థులకు గాయాలు

615చూసినవారు
తెనాలిలో డ్రైనేజీ మ్యాన్‌హోల్ తెరిచి ఉంచడం.. విద్యార్థులకు గాయాలు
తెనాలి మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గంగానమ్మపేటలో అమ్మవారి గుడి ముందు డ్రైనేజీ పనుల కోసం తెరిచిన మ్యాన్‌హోల్‌ను మూయకుండా, ఎలాంటి హెచ్చరికలు లేకుండా వదిలేశారు. గురువారం రాత్రి అటుగా వెళ్తున్న ఓ బైక్ అదుపుతప్పి తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోవడంతో బైక్‌పై ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మున్సిపల్ అధికారుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.

సంబంధిత పోస్ట్