ఏఐ యాప్ సాయంతో చోరీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

570చూసినవారు
తెనాలిలో ఇటీవల జరిగిన హాఫ్‌పేట చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ‘ఆర్టీజీఎస్ ఏఐ సీసీటీవీ 360’ యాప్ సహకారంతో ఖమ్మం జిల్లాకు చెందిన బండి గోపిని శనివారం అరెస్ట్ చేశారు. ఈ నెల 9న ఓ ఇంట్లో రూ. 25 వేల నగదు అపహరించి కారులో పరారైన నిందితుడిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. కారు వివరాలను యాప్‌లో నమోదు చేయగా, నందివెలుగు జంక్షన్ వద్ద వాహనం కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 5 వేల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్