పర్చూరులో నిర్మాణ భవనంలో చోరీ. రూ. 22 వేల విలువైన సామగ్రి చోరీ

726చూసినవారు
పర్చూరులో నిర్మాణ భవనంలో చోరీ. రూ. 22 వేల విలువైన సామగ్రి చోరీ
పర్చూరు పట్టణంలో వరుస చోరీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా చీరాల–పర్చూరు ప్రధాన రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు, అందులో అమర్చేందుకు సిద్ధంగా ఉంచిన విద్యుత్ వైరింగ్, ట్యూబ్‌లైట్లు, ఇతర ఎలక్ట్రికల్ సామగ్రిని దొంగిలించారు. బాధితుడు వీరాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం, దొంగిలించబడిన వస్తువుల విలువ సుమారు రూ. 22 వేల వరకు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్