తెనాలి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ప్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా, విద్యుత్ తీగలు తగలడంతో కార్మికుడు శివనాగేశ్వరరావు (32) దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనపై తెనాలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.