కొల్లూరులో పోక్సో చట్టం కింద నమోదైన కేసులో నిందితుడు ఎడ్ల సురేష్‌కు ప్రత్యేక పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 15 వేల జరిమానా విధించింది. ప్రేమ పేరుతో బాలికను వేధించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ఈ వివరాలను కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు.