మీ భూమి మీ హక్కు పట్టాదార్ పాస్ పుస్తకం అందించిన ముఖ్యమంత్రి

727చూసినవారు
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు ప్రజావేదిక సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, భూ రికార్డుల వివరాలను తనిఖీ చేసి రైతు నాంచారయ్యకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందజేశారు. భూమి అనేది ఆస్తి మాత్రమే కాకుండా అది జీవనాధారం, భద్రత, గౌరవమని పేర్కొన్నారు. గత పాలనలో ప్రజల భూమిపై కన్నేసి రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్