సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

723చూసినవారు
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీన జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం తెలిపారు. వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారని కలెక్టర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం 10:35 గంటలకు తాడేపల్లి హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, 10:50 గంటలకు సూరేపల్లి గ్రామానికి చేరుకుంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్