నియోజకవర్గ రైతులను సీఎం ఆదుకోవాలి సిపిఎం డిమాండ్

1098చూసినవారు
వేమూరు నియోజకవర్గ రైతులు, ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కరించాలని సీపీఎం పార్టీ నాయకులు బుధవారం భట్టిప్రోలులో కోరారు. గురువారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో, ఏడాది పొడవునా జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గత ఏడాది పంట నష్టం పరిహారం ప్రతి రైతుకు అందేలా ఆదేశించాలని, దళితవాడల్లో స్మశానవాటికలకు స్థలాల కేటాయింపునకు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్