విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతల సహకారం అవసరం ఎంపీపీ

1181చూసినవారు
విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతల సహకారం అవసరం ఎంపీపీ
మండల కేంద్రం అమృతలూరులోని పీఎంశ్రీ జెడ్పీ హైస్కూలులో విద్యార్థులకు 120 భోజనం ప్లేట్లను దాత గ్రంథి సురేష్ - రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె 9వ తరగతి విద్యార్థిని గ్రంధి జ్యోత్స్నశ్రీ తన పుట్టినరోజు సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ మాట్లాడుతూ, దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, తద్వారా గ్రామానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు పేరు తెస్తారని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతల సహకారం అభినందనీయమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్