కొల్లూరు మండలంలోని ఈపూరు లంక సబ్ స్టేషన్, జువ్వలపాలెం సబ్ స్టేషన్, కొల్లూరు సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా శుక్రవారం ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కొల్లూరు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి సాయి రామకృష్ణ తెలిపారు. ఈ కారణంగా చిలుమూరు లంక, సుగ్గుణాలంక, ఈపూరు లంక, చింతల్లంక, పెదలంక, తిప్పల కట్ట, జువ్వలపాలెం, కిష్కిందపాలెం, పోతార్లంక, తడికలపూడి, తురకపాలెం, తోకలవానిపాలెం, కొల్లూరు, తడిగిపాడు, రావింకంపాడు, క్రాప, బొద్దులూరుపాడు, దోనెపూడి, చినపులివరు గ్రామ ప్రజలు ఇబ్బందులు పడనున్నారు.