ఆంధ్రజ్యోతి ఏబీఎన్ లో రాధాకృష్ణ వాస్తవాలు రాస్తే వైఎస్ఆర్సిపి శ్రేణులు దాడులకు ఎగబడటం దారుణమని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఖండించారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 50 ఏళ్ల అనుభవం ఉన్న రాధాకృష్ణ ప్రజాస్వామ్యబద్ధంగా వాస్తవ వార్తలు రాస్తారని, ఆయనకు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. పదవీ వ్యామోహంతో ప్రజలను రెచ్చగొట్టేలా కార్యాలయాలపై దాడులకు పూనుకోవడం వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు మంచి పద్ధతి కాదని విమర్శించారు.