ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

8201చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. వినుకొండ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, భూ సమస్యలు తదితర అంశాలపై వినతులు సమర్పించారు. సమస్యలపై అధికారులు, సంబంధిత శాఖలతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని నాయకులు ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్