
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం మోట్ల మల్లికార్జున పురం వద్ద శుక్రవారం ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెస్త శరత్ కుమార్ అనే యువకుడు స్పాట్ లో మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి కర్నూలు జిల్లా బోయిన చెరువు పల్లెకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.






































