అద్దంకి: ఈనెల 13న నిరవధిక సమ్మె

70చూసినవారు
అద్దంకి: ఈనెల 13న నిరవధిక సమ్మె
అద్దంకిలోని సుందరయ్య భవనం నందు సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిఐటియు మండల నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై ఈనెల 13న నిరవధిక సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. ఈ నిరవధిక సమ్మెకు పట్టణంలోని ప్రజలందరూ మద్దతు పలకాలని ఆయన కోరారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్