అమృతలూరు మండలానికి చెందిన ఆరుగురు అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి, మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బుధవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనందబాబు బాధితులకు అందజేశారు. మొత్తం 2,16,503 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.