బాపట్లజిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ (PGRS) సెంటర్‌ను తనిఖీ చేశారు. లబ్ధిదారులకు నేరుగా ఫోన్ చేసి అర్జీల పరిష్కారస్థితిని ఆరాతీశారు. ఒక అర్జీదారుడి సమస్యపై వేటపాలెం మండల తహసీల్దార్‌తో స్వయంగా మాట్లాడి తక్షణ చర్యలకు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని, అలసత్వం వహించరాదని హెచ్చరించారు. ప్రతి తహసీల్దార్ తన లాగిన్‌లోకి వచ్చే అర్జీలను పరిశీలించి, సమయానుకూలంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.