అద్దంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల కుకింగ్ ఏజెన్సీలకు మండల స్థాయి వంటల పోటీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. వివిధ రకాల వంటకాలను తయారు చేసి ప్రతిభ కనబరిచిన కుకింగ్ ఏజెన్సీలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని విజేతలను అభినందించారు.