పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల షార్ట్ మెమోలు విడుదలయ్యాయి. వీటిలోని పేరు, తల్లిదండ్రుల వివరాలు, జనన తేదీ వంటి అంశాల్లో ఏవైనా పొరపాట్లుంటే వెంటనే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని అద్దంకి డిప్యూటీ డీఈవో గంగాధర్ సూచించారు. వివరాల సవరణకు ఈ నెల 4వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని,
విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.