వాగు ఉధృతికి విద్యుత్ స్తంభం నేలకొరిగింది, సహాయ చర్యలకు ఆటంకం

15చూసినవారు
బల్లికురవ మండలం, వేమవరం గ్రామంలోని సిగ్నో సెరామిక్స్ కంపెనీ వద్ద వాగు ఉధృతికి విద్యుత్ స్తంభం నేలకొరిగింది. వాగు ప్రవాహం ప్రమాదకరంగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడిందని విద్యుత్ అధికారులు తెలిపారు. ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం సహాయంతో పడిపోయిన స్తంభాన్ని తొలగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇది కొత్తగా ఏర్పాటు చేస్తున్న 33 కెవి లైనుకు చెందిన స్తంభం కావడంతో, వేమవరం గ్రామానికి లేదా బల్లికురవ మండలంలో ఎవరికీ విద్యుత్ అంతరాయం కలగలేదని అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్