అద్దంకిలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హానికర రసాయనాలతో మామిడి పండ్లను మగ్గిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో పలు పండ్ల దుకాణాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న మామిడి పండ్ల నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ తెలిపారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.