మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలైన జె.పంగులూరు మండలంలోని బూదవాడ, కోటపాడు, కొండమూరు గ్రామాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం సందర్శించారు. తుఫాను వల్ల నీట మునిగిన మొక్కజొన్న, మినుము, మిర్చి, వరి పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. పంట నష్టాలను ఖచ్చితంగా నమోదు చేసి, ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే సహాయం త్వరితగతిన చేరేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి ఉంటుందని, ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.