కొరిశపాడు: రెండుగా చీలిన సిమెంట్ రోడ్డు

82చూసినవారు
కొరిశపాడు: రెండుగా చీలిన సిమెంట్ రోడ్డు
కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలోని 14వ వార్డు నందు రహదారులు అద్వానంగా మారాయి. సుమారు 14 సంవత్సరాల క్రితం నిర్మించిన సిమెంట్ రోడ్డులు రెండుగా మధ్యలోకి చీలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వార్డుకు చెందిన పలువురు ప్రజలు ఆదివారం వాపోయారు. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి కింద పడటంతో గాయాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్