కొరిశపాడు: సామాజిక భవనం నిర్మాణ పనులు ప్రారంభం

8చూసినవారు
కొరిశపాడు పమిడిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో 8 సంవత్సరాలుగా ఉన్న సామాజిక భవనం సమస్య పరిష్కారమైంది. శిథిలావస్థకు చేరిన భవనం వల్ల వలస కూలీలతో పాటు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. సొసైటీ చైర్మన్ జయకృష్ణ చొరవతో మంత్రి రవికుమార్ 36 లక్షలు మంజూరు చేయడంతో నూతన సామాజిక భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాలనీవాసులు బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు.