కొరిశపాడు మండల స్థాయిలో జరిగిన చెకు ముఖి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ స్థానం సాధించి జిల్లాస్థాయికి ఎంపికైన రాధాస్ గీతం హైస్కూల్ విద్యార్థులు శివరాం, దేదీ ప్యాంజలి, హేమంత్, ధనశ్రీ, విద్యుష లను ఎంఈఓ రాఘవరావు మంగళవారం అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలని, జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కనగాల సతీష్ బాబు, ప్రిన్సిపాల్ రాధాకృష్ణకుమారి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.