కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురువారం జరిగిన పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు నడిచి వెళ్ళకూడదని ఉద్దేశంతో అశిష్ట కంపెనీ మరియు తన మిత్రుల సహకారంతో సైకిళ్లను అందజేసినట్లు చెప్పారు. నియోజకవర్గం మొత్తం పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.